భారతీయ జనతా పార్టీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి సాయంత్రం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాదరణ భారీగా లభిస్తుండటంతో ఈ యాత్రకు మరింత ప్రధాన్యత పెరిగింది. రెండో విడదతలో భాగంగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల మీదుగా ఈ కొనసాగనుంది. ఈ యాత్రను ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ అలంపూర్‌లో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సంజయ్ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్దనున్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిమొదలు పెట్టనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు అలంపూర్ చేరుకుంటారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అయిదు గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మొదటిరోజు సంజయ్ నాలుగు కిలోమీటర్లు నడిచి రాత్రి ఇమామ్‌పూర్‌లో బస చేస్తారు. రెండోరోజు నుంచి 13కి.మీ చొప్పున యాత్రచేస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి.
31 రోజులపాటు: రెండో విడత పాదయాత్ర 31 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో యాత్ర కొనసాగించి, మధ్యాహ్న సమయంలో పార్టీ రాష్ట్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. మొత్తం 387 కి.మీ దూరం సాగే కార్యక్రమం.. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర సమరశంఖం చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా చార్మినార్ చేరుకుని అక్కడి నుంచి మొదలు పెట్టారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…
ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్ వద్ద రేంజ్ రోవర్ కారులో మంటలు..