Bandi Sanjay: నిరుద్యోగులకు రూ. లక్ష ఇవ్వాలి.. కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై బండి సంజయ్‌ కౌంటర్..

|

Mar 29, 2023 | 5:24 PM

కేటీఆర్‌ ఇచ్చిన లీగల్‌ నోటీసులపై బండి సంజయ్‌ స్పందించారు. నీ పరువుకే రూ.100 కోట్లయితే..30 లక్షల మంది యువత భవిష్యత్‌ ఏమిటని ప్రశ్నించారు. వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తారని నిలదీశారు.

Bandi Sanjay: నిరుద్యోగులకు రూ. లక్ష ఇవ్వాలి.. కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై బండి సంజయ్‌ కౌంటర్..
Bandi Sanjay
Follow us on

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయల్లో మాటల యుద్ధంగా మారుతోంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులపై లీగల్ గానే ఎదుర్కొంటానన్న బండి సంజయ్.. నీ పరువుకే రూ.100 కోట్లయితే, 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

లీకేజీలో నా కుట్ర ఉందన్న నీపై ఎంత దావా వేయాలి..? నీ ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ నోటీసులను లీగల్‌గా ఎదుక్కొంటామన్నారు. మంత్రి కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసేదాకా పోరాడతామని .. ఈ కేసులో సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని, నిరుద్యోగులకు ప్రభుత్వం రూ.లక్ష ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

“సారీ చెబుతారా… లేక వంద కోట్ల పరువు నష్టం చెల్లిస్తారా” అంటూ బండిసంజయ్‌ , రేవంత్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ లీగల్‌ నోటీసులు పంపారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తన హస్తం ఉందంటూ బండి సంజయ్, రేవంత్ చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. వారం రోజులు టైమిస్తున్నా, ఈలోపు క్షమాపణ చెప్పారా ఓకే… లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ బండి సంజయ్, రేవంత్ లకు లీగల్‌ నోటీసులు పంపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం