Huzurabad By Election: వీవీ ప్యాట్ల తరలింపుపై ఫిర్యాదు.. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు.. డీకే అరుణ..

|

Oct 31, 2021 | 12:53 PM

శనివారం రాత్రి హుజురాబాద్‎లో వీవీ ప్యాట్లను ప్రైవేట్ కారులో తరలించడంపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ జాయతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. వీవీ ప్యాట్లను తరలిస్తున్న బస్సులను టీఆర్ఎస్ నేత హోటల్ ముందు ఆపారని చెప్పారు...

Huzurabad By Election: వీవీ ప్యాట్ల తరలింపుపై ఫిర్యాదు.. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు.. డీకే అరుణ..
Dk Aruna
Follow us on

శనివారం రాత్రి హుజురాబాద్‎లో వీవీ ప్యాట్లను ప్రైవేట్ కారులో తరలించడంపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ జాయతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. వీవీ ప్యాట్లను తరలిస్తున్న బస్సులను టీఆర్ఎస్ నేత హోటల్ ముందు ఆపారని చెప్పారు. పంక్చర్ అయిందన్న సాకుతో బస్సులోని ఒక వీవీ ప్యాట్ బాక్స్‎ని కారులో పెట్టారని ఆమె ఆరోపించారు. ఇది గమనించిన బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయని వెల్లడించారు.

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. పోలీస్ భద్రత లేకుండా బస్సుల్లో ఈవీఎంలను తరలించాల్సిన అవసరం ఏముందని? ఆమె ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని డీకే అరుణ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ హైదరాబాద్ నుంచి కంటైనర్‎లో డబ్బులు పంపించారని ఆరోపించారు. టీఆరఎస్ ఎన్ని డబ్బులు కుమ్మరించినా అక్కడి ప్రజలు ఈటలనే గెలిపిస్తున్నారని చెప్పారు. అందుకే కుట్రలు చేసి గెలవాలని చూస్తన్నారని తెలిపారు. వీవీ ప్యాట్ ఏ విధంగా బయటకొచ్చిందో సీబీఐ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారుల తీరు పలు అనుమానాలకు తెరలేపిందని మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల ఆరోపించారు. ఓట్లు వేసిన బాక్సులను మాయం చేయడం దుర్మార్గమన్నారు. పొరపాటు జరిగిందని కలెక్టర్‌ చెబుతున్నారన్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికలో ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. సీపీ, కలెక్టర్‌కు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. సీపీ, కలెక్టర్‌కు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజురాబాద్‎లో శనివారం రాత్రి వీవీ ప్యాట్ల తరలింపు ఘటనపై బీజేపీ హైదరాబాద్‎లో నిరసనకు దిగింది. సికింద్రాబాద్ ఎంజీ రోడ్‎లోని గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు.

Read Also.. Huzurabad By Election: నవంబర్‌ 2న విజయోత్సవం జరుపుకుందాం.. హుజూరాబాద్ ఎన్నికలపై హరీష్ రావు.