Telangana BJP: బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింద. అయితే ఈ విషయాన్ని బీజేపీ ఇప్పుడు జాతీయ స్థాయిలోకి తీసుకుని వెళ్లాలని అనుకుంటోంది. మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని నిర్ణయించారు. స్పీకర్ తీరుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేశారో చెప్పాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. గతంలో గవర్నర్‌పై పేపర్లు చించివేశారని.. బల్లలు ఎక్కి నిరసన తెలిపిన సందర్భాలూ ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలోనే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే రఘనందన్‌రావు గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చకు సిద్ధమని మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. బడ్జెట్‌ను తప్పుల తడకగా అభివర్ణించారు. అభివజ్క్షుడిగా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తప్పులు తెలుసు కాబట్టి.. అసెంబ్లీలో లేకుండా చేయాలని సస్పెండ్ చేశారని మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఈటల రాజేందర్ అన్నారు.
అయితే కేవలం న్యాయ పోరాటమే కాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ దొరికగానే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేయనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.
-అగస్త్య కంటు, టీవీ9 తెలుగు.
Also read:
Healthy Heart Tips: “ఆమె”నే వెంటాడుతున్న గుండె నొప్పి.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..
Women’s Day 2022: తెలంగాణ మణిహారం మల్లన్న సాగరం.. ఈ ప్రాజెక్టులో మరిచిపోలేని ‘ఆమె’ కృషి..