Raghunandan Rao: తప్పు చేయనప్పుడు సెల్‌ఫోన్‌ను చెత్త బుట్టలో ఎందుకు దాచిపెట్టారు.. మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్లను చెత్తడబ్బాలో దాచుకోవాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఐటీ దాడుల్లో కక్ష సాధింపులు ఉండవన్నారు..

Raghunandan Rao: తప్పు చేయనప్పుడు సెల్‌ఫోన్‌ను చెత్త బుట్టలో ఎందుకు దాచిపెట్టారు.. మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు
Raghunandan Rao

Updated on: Nov 23, 2022 | 2:42 PM

ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే మాధవేని రఘునందన్ రావు తప్పుపట్టారు. బాధ్యత గల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐటీ సోదాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండవని.. ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్లను చెత్తడబ్బాలో దాచుకోవాల్సిన అవసరం ఏముందని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఐటీ దాడుల్లో కక్ష సాధింపులు ఉండదన్నారు.. చట్టం ముందు అందరూ సమానులేనని రఘునందన్ రావు తెలిపారు. రేపు తనకు నోటీసు ఇచ్చినా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. వచ్చిన కంప్లైంట్ ప్రకారమే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. ఏ తప్పు చేయనప్పుడు మంత్రి మల్లారెడ్డికి భయం ఎందుకుని ప్రశ్నించారు. ఈ మధ్య ఎవరికి ఐటీ నోటీసులు ఇచ్చినా అస్వస్థత పేరుతో ఆస్పత్రికి వెళ్తున్నారని ఎద్దేవ చేశారు. తన కుమారుడిని కొట్టారని మల్లారెడ్డి అనడం సరికాదన్నారు.

బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్న మల్లారెడ్డి ఐటీ సోదాలను రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఐటీ అధికారులు వస్తే ఎందుకు తలుపులు తీయడం లేదో చెప్పాలని మంత్రిని రఘునందన్ రావు ప్రశ్నిచారు. గనులు, ఫార్మా, కాలేజీల వ్యాపారాలు చేస్తూ పన్నులు కట్టని వారిపై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

కొనసాగుతున్న దాడులు..

మంగళవారం అర్ధరాత్రి వరకూ దాడులు చేసిన అధికారులు.. ఇవాళ ఉదయం నుంచీ సోదాలు తిరిగి స్టార్ట్‌ చేశారు. ఈ రోజు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 50 బృందాలు మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించాయి. తనిఖీల్లో 200 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు అధికారులు. 5 కోట్ల నగదు.. పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక యూనివర్శిటీ, 38 ఇంజనీరింగ్ కాలేజీలు..

మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ శాఖ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డికి 2 వైద్య కళాశాలలు, 2 డెంటల్‌ కాలేజీలు, మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్‌.. ఒక యూనివర్శిటీ, 38 ఇంజనీరింగ్ కాలేజీలు, మొత్తం 6కు పైగా స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు ఐటీ అధికారులు.

కొడుకు ఆరోగ్య పరిస్ధితి..

ఓ వైపు మల్లారెడ్డి కొడుకు మహేందర్‌ రెడ్డి ఇంట్లో తనిఖీలు జరుగుతుండగా మరో వైపు మహేందర్‌రెడ్డికి చాతినొప్పి రాడవంతో నారాయణ హాస్పిటల్‌కి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కొడుకు ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకునేందుకు మల్లారెడ్డి హాస్పిటల్‌కి వెళ్లారు. మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు సైతం హాస్పిటల్‌కి చేరుకుని మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితిపై ఆరాతీశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం