తెలంగాణ డీజీపీపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు స్వాగతం తెలిపేందుకు వెళుతున్న కార్యకర్తలను, అభిమానులను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మొదటి నుంచి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రఘునందన్‌రావు మండిపడ్డారు. పదోన్నతుల కోసం, పోస్టింగుల కోసం పోలీసులు చేస్తున్న తప్పుల వల్ల ప్రజాస్వామిక విధానాలకు విఘాతం కలుగుతుంన్నారు. ప్రజా స్వామ్యాని గౌరవించి, హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగనివ్వాలని రఘునందన్‌రావు కోరారు. ఓ సీనియర్ నేత పార్టీ మారి వస్తుంటే స్వాగతం పలికేందుకు వస్తున్న ప్రజలను చూసి కడుపు ఎందుకు మండుతుందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఇంత అధ్వాన్న పరిస్థితి ఉంటే రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయన్నారు.
చిల్లర చేష్టలకు, పిచ్చి పనులకు ఉన్నతాధికారులు.. తమ కింది స్థాయి అధికారులను బలి చేయొద్దని రఘునందన్ రావు అన్నారు. బంతిని ఎంత కిందికి కొడితే అంతే పైకి వచ్చినట్లు.. హుజురాబాద్‌లో దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందని రఘునందన్‌రావు చెప్పారు. ఎవరైనా కార్యకర్తలు స్వాగతం పలికేందుకు వెళితే అడ్డుకోకుండా ప్రజాస్వామిక స్ఫూర్తిని గౌరవించాలని కోరారు. ఎయిర్ పోర్టులో అడ్డుకున్నంత మాత్రానా హూజురాబాద్ గెలుపును ఆపలేరని అన్నారు.
Also Read: సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. వాహనం మార్చక తప్పదంటున్న జనం.. గాడిద సాయంతో