AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్న BJP నేతలు.. తెలంగాణలో జూన్ 22న ‘ ఇంటింటికీ బీజేపీ’..

9 years of Modi Government: తెలంగాణ బీజేపీ నేతలు జూన్ 22న రాష్ట్రంలో ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలవని ప్లాన్ చేశారు. పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు నేతలంతా ఓటర్ల ఇళ్లకు వెళ్లనున్నారు. ఒక్కో బూత్ ప్రెసిడెంట్..

Telangana: ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్న BJP నేతలు.. తెలంగాణలో జూన్ 22న ' ఇంటింటికీ బీజేపీ'..
Telangana Bjp
Sanjay Kasula
|

Updated on: Jun 19, 2023 | 6:14 PM

Share

హైదరాబాద్, జూన్ 19: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ నేతలు జూన్ 22న రాష్ట్రంలో ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలవని ప్లాన్ చేశారు. పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు నేతలంతా ఓటర్ల ఇళ్లకు వెళ్లనున్నారు. ఒక్కో బూత్ ప్రెసిడెంట్ కనీసం 100 కుటుంబాలను కలుస్తారు ఆ పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకులు ఆయా నియోజకవర్గాల్లోని కుటుంబాలను కలిసి మోదీ పాలన, ఏం చేశారు.. ఏం చేయనున్నారు అనే అంశాలపై వెల్లడించనున్నారు

జూన్ 22 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేతలు కుటుంబాలను కలుస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షల బూత్ కమిటీలు ఉన్నాయని.. వాటి కేంద్రంగా ‘ ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యూహం రచించించారు బీజేపీ నాయకులు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురిలోని కుటుంబాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలవనున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్‌ నేతలు కూడా తమ నియోజకవర్గంలోని ప్రజలను కలిసి ప్రధాని మోదీ ఈ తొమ్మిదేళ్లలో ఏం చేశారో చెప్పనున్నారు. మహాజనసంపర్క్ యాత్రలో భాగంగా బీజేపీ నేతలు జూన్ 22 నుంచి 30 వరకు ప్రజలను కలుస్తున్నారు.

తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ..

నెహ్రూ, ఇందిర తర్వాత.. తొలి దఫా కన్నా రెండోదఫాలో ఎక్కువ సీట్లు సాధించిన నేతగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించారు. రాజీవ్‌గాంధీ తర్వాత సింగిల్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడాయన. దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లాలంటే.. ఒక విజన్ ఉండాలి. ముందు అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలి. వాస్తవానికి అత్యంత సంక్లిష్టమైన ఈ దేశాన్ని ఒక్కతాటిపై ముందుకు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. గొప్ప సంకల్పబలం ఉన్న నాయకులకైనా అంతకుమించిన సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం నరేంద్రమోదీ అదే దశలో ఉన్నారు. అసలే ప్రపంచ ఆర్థికమాంద్యం, ఇంతలో కరోనా వైరస్‌ కలగలసి- దేశాన్ని సుడిగుండంలోకి నెడుతున్న పరిస్థితి. ఈ నైరాశ్యాన్ని తరిమికొట్టడానికి నరేంద్రమోదీ- హెర్క్యులస్‌లా ముందు నిలబడ్డారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ- భారత్‌ను గ్లోబల్‌ లీడర్‌గా చేయాలన్న ఆశలను, ఆశయాలను వదిలపెట్టని విక్రమార్కుడిలా ముందుకు వెళ్తున్నారు మోదీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం