Harithotsavam: తెలంగాణలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి.. ఏడేళ్లలో హరితాహారం ఖర్చు రూ. 10 వేల కోట్లు..

Harithotsavam: తెలంగాణలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి.. ఏడేళ్లలో హరితాహారం ఖర్చు రూ. 10 వేల కోట్లు..

Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Jun 19, 2023 | 1:14 PM

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొక్కను నాటి హరిత హారాన్ని

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొక్కను నాటి హరిత హారాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 2013 నుంచి 2023 వరకు273.33 కోట్ల మొక్కలు నాటారు. హరితహారం నిర్వహణ కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చు చేసింది. 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు, 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

Published on: Jun 19, 2023 01:11 PM