Boora Narsaiah Goud: ’టీఆర్ఎస్ అలా నిరూపిస్తే ఉరేసుకుంటా’.. మాజీ ఎంపీ బూర నర్సయ్య ఛాలెంజ్..

|

Oct 20, 2022 | 7:52 AM

మునుగోడులో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.. బీసీ అభ్యర్థి పేరును పరిశీలించండి అని కోరినందుకే తనపై కత్తిగట్టారని బూర నర్సయ్య ఆరోపిస్తున్నారు.

Boora Narsaiah Goud: ’టీఆర్ఎస్ అలా నిరూపిస్తే ఉరేసుకుంటా’.. మాజీ ఎంపీ బూర నర్సయ్య ఛాలెంజ్..
BJP Leader Boora Narsaiah Goud
Follow us on

మునుగోడు సెంట్రిక్‌గా తెలంగాణాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతోంది. మొన్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని లాగేశారు. ఇప్పుడు గులాబీ దళం నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్‌ను తమ బుట్టలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 బిగ్‌డిబేట్‌లో బూర నర్సయ్య విసిరిన ఛాలెంజ్ ఒకటి.. గులాబీ-కమలం పార్టీల్లో కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఆయనేమన్నారు.. దానికి టీఆర్‌ఎస్ దగ్గరుండే ఆన్సరేంటి?.. అనేది ఇప్పుడు చూద్దాం..

కేసీఆర్‌తో రెండునిమిషాల సేపు మాట్లాడి మూడేళ్లయిందంటూ బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. సొంత ముఖ్యమంత్రిని కలవనివ్వని ఆ పార్టీ కూడా ఒక పార్టీనా? అంటూ విమర్శించారు. కేసీఆర్ చూపించిన వివక్ష వల్లే పార్టీ నుంచి బైటికొచ్చానని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. వాళ్లు అవమానించి పొగ పెట్టడం వల్లే బీజేపీలో చేరానంటూ స్పష్టంచేశారు. మునుగోడులో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.. బీసీ అభ్యర్థి పేరును పరిశీలించండి అని కోరినందుకే తనపై కత్తిగట్టారని బూర నర్సయ్య ఆరోపిస్తున్నారు.

మునుగోడులో మరో ఆశావహుడు కంచర్ల క్రిష్ణారెడ్డిని పిలిచి మాట్లాడి.. నన్ను మాత్రం ఎందుకు విస్మరించారు… బీసీలంటే అంత లోకువైందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు బూర. కానీ.. మునుగోడు అభ్యర్థి ఎంపిక సమయంలో బూర నర్సయ్యగౌడ్‌ను కూడా కేసీఆర్ సంప్రదించారని, ప్రగతిభవన్‌కి పిలిచి మాట్లాడారని, ఆయన కన్విన్స్ అయ్యాకే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అదంతా శుద్ధ అబద్ధం.. నన్ను ప్రగతిభవన్‌కి పిలిచినట్టు రుజువు చేస్తే ఉరేసుకుంటా అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు బూర నర్సయ్య..

ఇవి కూడా చదవండి

టీవీ9 బిగ్‌డిబేట్‌లో బూర నర్సయ్య గౌడ్ విసిరిన ఈ ఛాలెంజ్‌ తెలంగాణా భవన్‌లో రీసౌండ్ ఇస్తోంది. ప్రగతిభవన్‌కి ఆయన్ను పిలిచి మాట్లాడినప్పటి వీడియోలు గానీ, ఫోటోలు గానీ బైటపెట్టి బూర నర్సయ్య బండారాన్ని బైటపెట్టాలని భావిస్తున్నారు గులాబీ నేతలు. కమలం పార్టీ ఆకర్షణకు సరెండరైన బూర నర్సయ్యను.. మునుగోడు ఎన్నికల క్షేత్రంలో ఈవిధంగా ఎండగట్టొచ్చని భావిస్తోంది టీఆర్ఎస్ పార్టీ.. కానీ, తనను కేసీఆర్ విస్మరించి అవమానపరిచారన్న మాటకు కట్టుబడే ఉన్నానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.

వీడియో చూడండి..

అమిత్ షాతో భేటీ..

కాషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వారితో పలు విషయాలపై మాట్లాడారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇంఛార్జి తరుణ్ చుగ్ కూడా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..