Telangana BJP: మా స్ట్రాటజీ మాకుంది.. ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదంటున్న తెలంగాణ బీజేపీ..

| Edited By: Sanjay Kasula

Oct 11, 2023 | 1:30 PM

తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ ఇంజన్‌ సర్కారు నినాదంతో ముందుకు వెళ్తోంది కమల దళం. ప్రధాని మోదీ హామీలతో ఉత్సాహంగా ఉన్న కమల దళం..అదే ఊపుతో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల కోసం గట్టి కసరత్తు చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో జెండా పాతేందుకు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో తమ దారి తమదే అంటుంది బీజేపీ. ఏ సమయంలో ఏం చేయాలో అదీ చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి తమ స్ట్రాటజీ తమకు ఉందని కమలం పార్టీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. 

Telangana BJP: మా స్ట్రాటజీ మాకుంది.. ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదంటున్న తెలంగాణ బీజేపీ..
BJP
Follow us on

తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. మేనిఫెస్టోలో ఉండే అంశాలను పై క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆ పార్టీ మాత్రం తమ ప్లాన్ ప్రకారమే వెళతామని చెబుతోంది. రీసెంట్‌గా జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ లు, రాష్ట్ర కౌన్సిల్ సమావేశం లో తాము అధికారం లోకి వస్తామనే ధీమాను ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది… ఎన్నికల నేపథ్యంలో చేయాల్సిన పనులను సూచించింది. ఎజెండా ఇచ్చింది.

పార్టీ కి బలం బూత్ కమిటీలు కాబట్టి వాటి పైనే ఆ పార్టీ ప్రధాన దృష్టి పెట్టనుంది. అసెంబ్లీ జిల్లా కొర్ కమిటీలని వేసింది. ప్రతి నియోజక వర్గానికి ఒక పూర్తి సమయ కార్యకర్తను నియమించింది. తెలంగాణను 6 జోన్‌లుగా విభజించిన ఆ పార్టీ ఒక్కో జోన్‌కు ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకి బాధ్యతలు అప్పగించింది. 38 జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను నియమించింది వారు పని మొదలు పెట్టారు.

ఇతర రాష్ట్రాల సీఎంల సభలు..

బీజేపీ అగ్ర నేతల సభలు పెద్ద ఎత్తున పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సార్లు తెలంగాణ కు వచ్చారు. అంతేకాాదు తెలంగాణలో మరిన్ని సభలు ఉండే అవకాశం ఉంది. అమిత్ షా సభ ఇప్పటికే జోష్ నింపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాథ్ సహా ఇతర రాష్ట్రాల సీఎంల సభలు తెలంగాణ కు వస్తారని ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రచారం ముగిసే చివరి వారంలో బీజేపీ అగ్ర నాయకత్వం అంతా తెలంగాణలో విస్తృత ప్రచారం చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉన్న… ఏకాభిప్రాయం ఉన్న కొన్ని స్థానాల కి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది..నోటిఫికేషన్ తర్వాతే మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. ఈనెలలో తెలంగాణాలో 30కి పైగా సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది బీజేపీ.  రెండు విడతలుగా తెలంగాణా టూరేస్తారు హోమ్‌మంత్రి అమిత్‌షా. రాజేంద్రనగర్, ఆదిలాబాద్ బహిరంగసభల్లో పాల్గొంటారు. రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తెలంగాణాలో పర్యటిస్తారు. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార పర్వం.. ఇలా పక్కా ఎలక్షన్ ఎజెండాతో దూకుడు పెంచేసింది బీజేపీ. అటు.. కొందరు ప్రధాని తెలంగాణ టూర్‌కు హాజరు కాని విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మరికొందరు నేతల తీరుపై ఫోకస్ పెట్టింది అధిష్టానం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి