Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Elections: సింగరేణి ఎన్నికలు వాయిదా.. హైకోర్టు కీలక ఉత్తర్వులు..

Singareni Elections: సింగరేణి ఎన్నికలు వాయిదా.. హైకోర్టు కీలక ఉత్తర్వులు..

Shiva Prajapati

|

Updated on: Oct 11, 2023 | 12:56 PM

Singareni Elections Postponed: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ సన్నాహాలు చేసింది. అయితే ఈ ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం పిటిషన్‌ దాఖలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కోరింది యాజమాన్యం. అయితే సింగరేణి ఎన్నికల వివాదం గత ఏడాది నుండి కోర్టులో కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ గడువును 3 సార్లు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Singareni Elections Postponed: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ సన్నాహాలు చేసింది. అయితే ఈ ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం పిటిషన్‌ దాఖలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కోరింది యాజమాన్యం. అయితే సింగరేణి ఎన్నికల వివాదం గత ఏడాది నుండి కోర్టులో కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ గడువును 3 సార్లు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అప్పీల్ చేసింది సింగరేణి యాజమాన్యం.

తెలంగాణలో సోషల్‌ మీడియాపై ఈసీ స్పెషల్‌ ఫోకస్..

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది ఈసీ. రాజకీయ, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిఘా పెంచారు. గూగుల్ సహా ఇతర సంస్థలతో ఇప్పటికే ఈసీ చర్చు జరిపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్దంగా ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్‌లపై వివిధ వెబ్‌సైట్ల ద్వారా స్కాన్ చేస్తున్నారు. తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎంఎస్‌లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.