MLA Raja Singh: గడువు పొడిగించాలని బీజేపీకి రాజాసింగ్ భార్య లేఖ.. అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..

|

Sep 02, 2022 | 8:45 AM

రాజాసింగ్‌ ఎపిసోడ్‌లో పార్టీ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఆయనకు పార్టీ ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. కానీ వివాదాస్పద వ్యాఖ్యలపై వివణ ఇచ్చేలా కనిపించడం లేదు. క్రమశిక్షణ కమిటీకి..

MLA Raja Singh: గడువు పొడిగించాలని బీజేపీకి రాజాసింగ్ భార్య లేఖ.. అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..
Mla Raja Singh
Follow us on

ఎమ్మెల్యే రాజా సింగ్‌(MLA Raja Singh) ఎపిసోడ్‌లో పార్టీ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఆయనకు పార్టీ ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. కానీ వివాదాస్పద వ్యాఖ్యలపై వివణ ఇచ్చేలా కనిపించడం లేదు. క్రమశిక్షణ కమిటీకి గురువారం రాజాసింగ్‌ భార్య మెయిల్‌ పంపారు. సమాధానం చెప్పేందుకు సమయం కావాలని కోరారు. మరి పార్టీ గడువు ఇస్తుందా లేక చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. అంతకుముందు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని క్రమశిక్షణ కమిటీ నోటీస్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సమయం కావాలని కోరారు రాజాసింగ్‌ భార్య.

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను వ్యతిరేకిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ పాత బస్తీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాతబస్తీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎంఐఎం నాయకులు. చివరకు రాజాసింగ్ ను ఆగస్ట్ 25న పిడి యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాజాసింగ్ ను గత నెల 23న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ గడువు ఇవ్వాళ్టితో  పూర్తవ్వనుంది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉండటంతో గడువు దగ్గరకు వచ్చినా బీజేపీ క్రమశిక్షణా కమిటీకి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో మరింత గడువు కావాలని ఆయన కుటుంబ సభ్యులు, భార్య బీజేపీ క్రమశిక్షణా కమిటీని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం