ఉప యుద్ధం ముదురుతోంది. మునుగోడు రాజకీయం రోజురోజుకీ ఉత్కంఠ పెంచేస్తోంది. పండుగ పూట ప్రచార పర్వంతో హోరెత్తుతోంది మునుగోడు. అగ్రనేతల ఎంట్రీతో మునుగోడు క్యాంపెయిన్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. యుద్ధం పీక్స్‌కు చేరింది. పండుగ ముంగిట బై పోల్ క్యాంపెయిన్ మరింత హీటెక్కుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రచారపర్వంలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు క్యాంపెయిన్‌కు మరింత పదును పెడుతున్నాయి. ఓవైపు వలసలపై ఫోకస్ పెంచుతూనే.. ప్రచార వేడిని రగిలిస్తున్నాయి. టైమ్ దగ్గరపడుతోంది. సమయం ముంచుకొస్తోంది. ఎన్నికల టైమ్‌తో పాటే పోటీపడి నడుస్తున్నారు నేతలు. ఇవాళ గట్టుప్పల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మునుగోడు చుట్టేశారు మంత్రి. మునుగోడుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీఆర్‌ఎస్ అధినాయకత్వం.. బాధ్యతల్ని మంత్రి కేటీఆర్‌కు అప్పజెప్పింది. మునుగోడులో గెలిచి తీరాలన్న కసితో ముందుకెళ్తున్నారు కేటీఆర్. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమన్వయం చేస్తూనే.. స్వయంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇటు.. బీజేపీ సైతం ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అగ్రనేతలు మునుగోడులో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. నేడు చండూరులో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ప్రచారం చేపట్టబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మునుగోడు మండలంలో రోడ్‌షో నిర్వహించబోతున్నారు. మునుగోడులో గెలిచి.. సాధారణ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది కమలదళం. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు వ్యూహాల్ని రచిస్తూ ముందుకు కదులుతోంది.
మరోవైపు.. ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. వలసలపై బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
ఇక మరో పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు ఫుల్‌స్టాప్ పడడం లేదు. కీలక సందర్భంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి కామెంట్స్‌పై రియాక్టయిన మాణిక్కం ఠాగూర్.. ఈ వ్యవహారాన్ని AICC చూసుకుంటుందని చెప్పారు.
మరిన్ని మునుగోడు వార్తల కోసం..