September 17th Celebrations: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగం..

Amit Shah Meeting Parade Grounds:: నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 సంవత్సరాలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో..

September 17th Celebrations: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగం..
Amit Shah In Hyderabad

Updated on: Sep 17, 2022 | 8:23 AM

Amit Shah Meeting Parade Grounds: నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 సంవత్సరాలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించి బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. వీరితో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 8.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తారు.

ఇకపోతే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ శుక్రవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన కేంద్ర హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ బీజేపీ నేతలు. కాగా, ఈరోజు జరిగే అధికారకి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంటికి వెళ్తారు. ఇటీవల ఈటల తండ్రి చనిపోవడంతో.. కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Sep 2022 07:53 AM (IST)

    బీజేపీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన వేడుకలు..

    రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన నాటి కేంద్ర హోంమంత్రి, దివంగత నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు కిషన్ రెడ్డి.

  • 17 Sep 2022 07:51 AM (IST)

    బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జండా ఎగురవేసిన బండి సంజయ్

    తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు.


  • 17 Sep 2022 07:50 AM (IST)

    సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించిన బీజేపీ నేతలు..

    అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
    బిజెపి నేతలు ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్,ఎమ్మెల్యే రఘునందన్ రావు, నేతలు వివేక్, రామచంద్ర రావు.