Mutton Prices : పండగ పూట మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కనుమ రోజు భారీగా పెంచేసిన వ్యాపారులు

ముద్ద దిగాలంటే.. ముక్క ఉండాల్సిందే !  పండుగ వచ్చిందంటే చాలు సామాన్య జనంను దోచుకునేందుకు అంతా రెడీ అవుతారు. అయితే మటన్ వ్యాపారులు..

Mutton Prices : పండగ పూట మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కనుమ రోజు భారీగా పెంచేసిన వ్యాపారులు

Updated on: Jan 15, 2021 | 9:16 AM

Mutton Prices : ముద్ద దిగాలంటే.. ముక్క ఉండాల్సిందే !  పండుగ వచ్చిందంటే చాలు సామాన్య జనంను దోచుకునేందుకు అంతా రెడీ అవుతారు. అయితే మటన్ వ్యాపారులు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. పండగ పూట మటన్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. మాంసపు ప్రియులకు కనుమ రోజు ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇదే అదునుగా.. దోచుకుంటున్నారు మటన్ వ్యాపారులు.

అంతేకాకుండా పండక్కి చుట్టాలు, అల్లుళ్ళు, ఇంటికి రావడంతో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే అంటున్నారు. దీన్ని అదునుగా చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు 650రూపాయలు ఉన్న మటన్ ఒక్కసారిగా 800పెరిగింది, మటన్ ధరలు పెరిగినా పండగ పూట వెనక్కి తగ్గేది లేదంటూ పోటీపడుతున్నారు మాంసం ప్రియులు.

బర్డ్‌ఫ్లూతో చికిన్‌ రేట్లు అమాంతం పడిపోతే… మటన్‌ రేట్లు మంట పుట్టిస్తున్నాయి. చికెన్ తింటే వైరస్ వస్తుందన్న పుకార్లు… మటన్‌ వ్యాపారుల బిజినెస్‌ను పెంచేశాయి. ఇక ఇదే అదునుగా వ్యాపారులు మాంసం ధరలు ఒక్కసారిగా పెంచేశారు. హైదరాబాద్‌లో మటన్‌ ధర 600నుంచి 800 రూపాయలకు చేరింది. జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో రేట్లు భారీగా పెంచేశారు.

ఇవి కూడా చదవండి :

Bird flu: రోజు రోజుకు విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో 382 పక్షులు మృతి

Jallikattu in Madurai : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. పోటీలో 658 మంది, 790 ఎద్దులు సిద్ధం.. ఇక కుమ్మడే..