BRS MLAs: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

|

Jan 23, 2024 | 10:41 PM

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోవడం హట్‌టాపిక్‌గా మారింది. సీఎంను కలిసిన సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి, గూడెం మహిపాల్ రెడ్డి పఠాన్‌చెరు నుంచి, మాణిక్ రావు జహీరాబాద్ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుఫున విజయం సాధించారు.

BRS MLAs: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Brs Mlas Meet Cm Revanth
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోవడం హట్‌టాపిక్‌గా మారింది. సీఎంను కలిసిన సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి, గూడెం మహిపాల్ రెడ్డి పఠాన్‌చెరు నుంచి, మాణిక్ రావు జహీరాబాద్ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుఫున విజయం సాధించారు.

బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్ళిన ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సీఎం కలిసి వారంతా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కావడం విశేషం. వీరి భేటి రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సమావేశమైన వారిలో సునీతా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకురాలిగా క్రియాశీలకంగా వ్యవహారించారు. ఆమె నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలవడం మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ఆ మరుసటి రోజే ఈ ఎమ్మెల్యేలు ఇలా సమావేశం కావడం గమనార్హం. అందులోనూ అధిష్టానానికి సమాచారం ఇవ్వకపోడం సంచలనంగా మారింది.

మరోవైపు సీఎంతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలుసుకోవడం జరిగిందన్నారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయమై మాత్రమే ముఖ్యమంత్రితో చర్చించామన్నారు. ఎమ్మెల్యేల భద్రత, ప్రోటోకాల్ సమస్యలపై సీఎంతో నలుగురం శాసనసభ్యులం చర్చించామన్నారు. ఇంతకు మించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న సునీతా లక్ష్మారెడ్డి, రేపు మీడియాకు క్లారిటీ ఇస్తామంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఇదిలావుంటే, సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. లండన్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 39 ముక్కలు చేస్తామని సంలచన ప్రకటన చేశారు. ఆ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…