Rythu Bharosa: రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు

Rythu Bharosa: తెలంగాణలో రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులు విడుదలకు సమయం రానే వచ్చేస్తోంది. తొలి విడత ఎకరం ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడగా, ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లు డబ్బులు జమ కానున్నాయి..

Rythu Bharosa: రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు
Rythu Bharosa

Updated on: Apr 18, 2026 | 6:39 PM

Telangana Rythu Bharosa: తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపికబురు అందించింది. యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను ఈ నెల ఏప్రిల్ 20 (సోమవారం) న విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్నారు.

మొదటి విడతలో ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేయగా, ఈ రెండో విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ 6000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే రెండో విడతలో 45,11,947 మంది రైతులకు లాభం చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రూ 5653 కోట్లు జమ కానున్నాయి. మొత్తం 73 లక్షల మంది రైతులు ఈ పథకం ప్రయోజనం పొందనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం ఈ సీజన్‌కు గానూ మొత్తం రూ.9,000 కోట్ల నిధులను మూడు విడతలుగా విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • మొదటి విడత: మార్చి 22న రూ.3,590 కోట్లు (1 ఎకరం లోపు రైతులకు).
  • రెండో విడత: ఏప్రిల్ 20న రూ.5,653 కోట్లు (5 ఎకరాల వరకు).
  • మూడో విడత: ఏప్రిల్ చివరి వారం (మిగిలిన రైతులందరికీ).

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us