Big News Big Debate: హంగ్‌ మార్తాండ.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు..

|

Feb 14, 2023 | 7:17 PM

ఒక్క కామెంట్..ఒకే ఒక్క కామెంట్..! తెలంగాణ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టిస్తోంది. పొలిటికల్‌ రిక్టర్ స్కేల్‌పై ఇప్పటికే హైవోల్టేజ్ హీట్‌ జనరేట్ అయింది. ఆ ప్రకంపనలు కాంగ్రెస్‌లో తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నాయి.

Big News Big Debate: హంగ్‌ మార్తాండ.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు..
Big News Big Debate
Follow us on

ఒక్క కామెంట్..ఒకే ఒక్క కామెంట్..! తెలంగాణ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టిస్తోంది. పొలిటికల్‌ రిక్టర్ స్కేల్‌పై ఇప్పటికే హైవోల్టేజ్ హీట్‌ జనరేట్ అయింది. ఆ ప్రకంపనలు కాంగ్రెస్‌లో తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో నెక్ట్స్ వచ్చేది ముమ్మాటికి హంగే.. అంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్రంగా రాజకీయం వేగంగా మారుతోంది. సొంత పార్టీలో అలజడి రేపితే.. ప్రత్యర్ధి పార్టీలు రెండింటిని టార్గెట్‌ చేయడానికి కమలనాథులకు అస్త్రంగా మారింది. ఇక ఎవరితోనూ మాకు పొత్తు లేదు.. రహస్య స్నేహం అంతకన్నా ఉండదంటూ బీఆర్ఎస్‌ ఫుల్‌ క్లారిటీతో వస్తోంది.

కోమటిరెడ్డి అంటే పేరు కాదు ఓ బ్రాండ్‌ అంటారు బ్రదర్స్. అయితే గతంలో తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోని దెబ్బ తీశారు. ఇప్పడు అన్నయ్య వంతు వచ్చినట్టుంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వివాదాలు కొత్తకాదు.. కానీ ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. ఆయన కామెంట్‌ అర్థం చేసుకుని పార్టీ కౌంటర్‌ ఇచ్చేలోగానే జరగాల్సిన నష్టం జరిగింది. తాము చెప్పిందే నిజమైందని బీజేపీ అంటోంది.

పార్టీలో ఉంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు చావుదెబ్బతీశాయని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదంతా బీజేపీ కోవర్టు ఆపరేషన్‌ అన్న అనుమానం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. పార్టీ ఇచ్చిన అలుసే కారణమన్న అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు.

తన కామెంట్స్‌తో తెలంగాణ పాలిటిక్స్‌ను కాస్త గట్టిగానే షేక్‌ చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఒక్కసారిగా అనేక ప్రశ్నలు.. ఇంకెన్నో అనుమానాలను తెరపైకి తెచ్చారు. సరిగ్గా మునుగోడుబైపోల్‌ టైమ్‌లో కాంగ్రెస్ ఓటమిని ముందుగానే ఖరారు చేసిన వెంకట్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ ఆ తరహా దుమారమే రేపారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబెట్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..