Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ

Telangana BJP Bandh: ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది.

Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ
Ts Bjp

Updated on: Jan 05, 2022 | 6:24 PM

Telangana Bandh on Jan 10th: ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 317 జీవోను పునఃసమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే, ఇందుకు నిరసనగా ఆందోళన చేస్తున్న అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీ నేతల ఆరోపిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 317 జీవోను పునః సమీక్షించాలని దీక్ష చేపట్టిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 10న తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ ప్రజలను కోరింది.

Read Also…  AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..