బీసీలకు 56 శాతం రిజర్వేషన్స్ ఉండాలి: ఆర్ కృష్ణయ్య

|

Sep 14, 2020 | 5:59 PM

ఈ నెల 23న హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో అఖిలపక్ష సమావేశం పోస్టర్ ను..

బీసీలకు 56 శాతం రిజర్వేషన్స్ ఉండాలి: ఆర్ కృష్ణయ్య
Follow us on

ఈ నెల 23న హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో అఖిలపక్ష సమావేశం పోస్టర్ ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ శాతం పెంచకుండా 17 కులాలను బీసీల్లో కలపడాన్ని ఆయన వ్యతిరేకించారు. గతంలో 96 కులాలు ఉండగా 25 శాతం రిజర్వేషన్ ఉండేదని…ఆ తరువాత 36 కులాలు అదనంగా చేర్చబడ్డాయని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ లెక్క ప్రకారం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నపుడు 56 శాతం రిజర్వేషన్ ఉండాలికానీ రిజర్వేషన్ శాతం పెంచకుండా కొత్తగా కులాలను చేర్చడం ఎంతవరకు సమంజసమని కృష్ణయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఓబీసీల గణన చేసి ఆయా కులాలకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో బీసీ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనికి తోడు కరోనాతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక సంక్షోభంలో ఉంటే.. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీం తీసుకొచ్చి మరింత భారం మోపిందని ఆయన ఆరోపించారు.