మహబూబాబాద్ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్ సిబ్బంది ఓవరాక్షన్ చేశారు. వారికి పోలీసులు కూడా జత కూడారు. అప్పు తీర్చలేదని రైతు మోహన్ ఇంటిపై దౌర్జన్యం చేశారు. నలుగురికి అన్నం పెట్టే రైతును కన్నీరు పెట్టేలా చేశారు. తమ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని.. రాగానే కడతామని చెప్పినా వినలేదు. రూల్స్ పేరుతో రెచ్చిపోయారు. జప్తు పేరుతో ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు బ్యాంక్ సిబ్బంది. ఆ రైతు కుటుంబం ఏదో దేశద్రోహం చేసినట్లు పోలీసులను కూడా తమతో తీసుకెళ్లి.. తమ కండకావరం ప్రదర్శించారు. ఫర్నీచర్, సామాగ్రిని సైతం ఆటోలో బ్యాంక్‌కి తరలించారు.
దీంతో.. అవమానభారంతో కన్నీరుమున్నీరు అయ్యింది బాధిత కుటుంబం. ఆ ఇంటి ఆడబిడ్డ అయితే ఎంతో ప్రాధేయపడింది కానీ బ్యాంక్ సిబ్బంది.. ఆమె గోడును పట్టించుకోలేదు. 2021లో వ్యవసాయ రుణం తీసుకున్నాడు రైతు మోహన్. పంట నష్టపోవడంతో అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో.. జప్తు పేరుతో ఈ రకంగా అతి చేశారు సిబ్బంది. విషయం తెలియడంతో… బ్యాంక్ సిబ్బందిపై డీసీసీబీ చైర్మన్ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న సిబ్బంది.. పరుగు పరుగున వచ్చి..
ఇంటికి తలుపులు బిగించారు. రెక్కలు ముక్కలయ్యేలా పని చేసి.. ఎవ్వరినీ మోసం చేయకుండా.. తన బ్రతుకు తాను బ్రతికే రైతు అంటే అందరికీ లోకువేలే. వేల కోట్లు.. వందల కోట్లు మోసం చేసి… విదేశాలకు విమానాల్లో పోతుంటే.. మాత్రం సినిమా చూసినట్లు చూస్తారు. ఎప్పుడు మారతార్రా మీరు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం