AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంత బలుపు మీకు..? లోన్ కట్టలేదని.. రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు..

ఇది ఓవరాక్షన్ కాదు అంతకు మించి.. లోన్ కట్టలేదని రైతు ఇంటి తలుపులు పెకిలించి వేశారు. ఇంట్లోని ఫర్నీచర్ సైతం తీసుకెళ్లారు బ్యాంకు సిబ్బంది. వారికి పోలీసులు సహకరించారు.

Telangana: ఎంత బలుపు మీకు..? లోన్ కట్టలేదని.. రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు..
Bank Staff
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2023 | 9:01 AM

Share

మహబూబాబాద్‌ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్‌ సిబ్బంది ఓవరాక్షన్‌ చేశారు. వారికి పోలీసులు కూడా జత కూడారు. అప్పు తీర్చలేదని రైతు మోహన్‌ ఇంటిపై దౌర్జన్యం చేశారు. నలుగురికి అన్నం పెట్టే రైతును కన్నీరు పెట్టేలా చేశారు. తమ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని.. రాగానే కడతామని చెప్పినా వినలేదు. రూల్స్ పేరుతో రెచ్చిపోయారు. జప్తు పేరుతో ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు బ్యాంక్‌ సిబ్బంది. ఆ రైతు కుటుంబం ఏదో దేశద్రోహం చేసినట్లు పోలీసులను కూడా తమతో తీసుకెళ్లి.. తమ కండకావరం ప్రదర్శించారు. ఫర్నీచర్‌, సామాగ్రిని సైతం ఆటోలో బ్యాంక్‌కి తరలించారు.

దీంతో.. అవమానభారంతో కన్నీరుమున్నీరు అయ్యింది బాధిత కుటుంబం. ఆ ఇంటి ఆడబిడ్డ అయితే ఎంతో ప్రాధేయపడింది కానీ బ్యాంక్ సిబ్బంది.. ఆమె గోడును పట్టించుకోలేదు. 2021లో వ్యవసాయ రుణం తీసుకున్నాడు రైతు మోహన్‌. పంట నష్టపోవడంతో అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో.. జప్తు పేరుతో ఈ రకంగా అతి చేశారు సిబ్బంది.  విషయం తెలియడంతో… బ్యాంక్ సిబ్బందిపై డీసీసీబీ చైర్మన్ రవీందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న సిబ్బంది.. పరుగు పరుగున వచ్చి.. ఇంటికి తలుపులు బిగించారు. రెక్కలు ముక్కలయ్యేలా పని చేసి.. ఎవ్వరినీ మోసం చేయకుండా.. తన బ్రతుకు తాను బ్రతికే రైతు అంటే అందరికీ లోకువేలే. వేల కోట్లు.. వందల కోట్లు మోసం చేసి… విదేశాలకు విమానాల్లో పోతుంటే.. మాత్రం సినిమా చూసినట్లు చూస్తారు. ఎప్పుడు మారతార్రా మీరు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్