హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. జాతీయ పార్టీలు రాష్ట్రంపై ఫోకస్ పెంచాయి. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ రెండు పార్టీల అధినాయకత్వాలు తెలంగాణపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై ఆరా తీస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలో కొంత కొత్త జోష్ కనిపిస్తుండగా.. బీజేపీలో నాయకులు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు ఈటల రాజేంద్ర, రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన కూడా ఢిల్లీకి వెళ్లారు. బండి సంజయ్ ఢిల్లీ టూర్‌పై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
అసంతృప్తి నేతల చర్చల తర్వాత ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. పార్టీ పెద్దలు, కేంద్రమంత్రులను కలవనున్నారు బండి సంజయ్. ఈటల, రాజగోపాల్ చర్చల సారాంశం బండికి వివరించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీలో లుకలుకలు సెట్ చేసే పనిలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను ఢిల్లీకి పిలిచినట్లుగా తెలుస్తోంది.
అసంతృప్తి నేతల చర్చల తర్వాత బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం.. ఆయన కూడా ఢిల్లీ పర్యటన వెళ్లడంపై ఆసక్తి నెలకొంది. నిన్నటి తెలంగాణ పర్యటనలో బండి నాయకత్వంపై నడ్డా పొగడ్తలు వర్ష కురిపించడం.. అంతకు ముందు రోజు ఢిల్లీలో అసంతృప్తి నేతలు ఈటల, రాజగోపాల్ రెడ్డిలకు బుజ్జగింపు జరపడం.. వరుస పరిణామాల నేపథ్యంలో ఏదో జరుగుతుందని ఇంటా, బయట చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం