AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుడివైపు గుండెతో పుట్టిన పాప..ఎంత క్యూట్‌గా ఉందో..

మనుషులందరికీ ఎడమవైపు గుండె ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ కొన్నిసార్లు జన్యులోపాల వల్ల కొందరు కుడివైపు గుండెతో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా జరగడం చాలా అరుదు. కోట్లలో ఒకరు ఇలా జన్మించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న పాప కూడా కుడివైపు గుండెతో జన్మించింది. మెదక్ జిల్లా తుప్రాన్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆబోతుపల్లిలో నివాసముంటున్న రమ్య, రెండో కాన్పుకు నెలలు నిండుతోన్న సమయంలో సాధారణ పరీక్షల నిమిత్తం […]

కుడివైపు గుండెతో పుట్టిన పాప..ఎంత క్యూట్‌గా ఉందో..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 30, 2019 | 6:21 PM

Share

మనుషులందరికీ ఎడమవైపు గుండె ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ కొన్నిసార్లు జన్యులోపాల వల్ల కొందరు కుడివైపు గుండెతో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా జరగడం చాలా అరుదు. కోట్లలో ఒకరు ఇలా జన్మించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న పాప కూడా కుడివైపు గుండెతో జన్మించింది. మెదక్ జిల్లా తుప్రాన్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆబోతుపల్లిలో నివాసముంటున్న రమ్య, రెండో కాన్పుకు నెలలు నిండుతోన్న సమయంలో సాధారణ పరీక్షల నిమిత్తం దగ్గరల్లోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు..స్కానింగ్‌లో పాపకు కుడివైపు గుండె ఉన్నట్లు నిర్ధారించారు.

దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కౌన్సిలింగ్ ఇచ్చిన డాక్టర్లు, బిడ్డకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రమ్యకు నొప్పులు రావడంలో ఆస్పత్రికి తరలించారు. సాధారణ ప్రసవంలోనేే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రమ్య. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు.