Telangana: అయ్యో తల్లీ.. కూల్‌డ్రింక్ అనుకొని పురుగుమందు తాగిన ఐదేళ్ల చిన్నారి..!

|

Sep 19, 2022 | 12:50 PM

Telangana: ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ ఘటన కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం..

Telangana: అయ్యో తల్లీ.. కూల్‌డ్రింక్ అనుకొని పురుగుమందు తాగిన ఐదేళ్ల చిన్నారి..!
Baby Girl
Follow us on

Telangana: ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ ఘటన కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్‌కు చెందిన రాజేష్, లావణ్యల ఐదేళ్ల కూతురు శాన్వి గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. సెలవు కావడంతో ఇంటి వెనుక ఉన్న పెద్దనాన్న ఇంటి వద్ద ఆడుకుంటోంది. అదే సమయంలో అక్కడ కనిపించిన కూల్ డ్రింక్ బాటిల్ లోని ద్రవనాన్ని తాగింది. అయితే అది పొలానికి పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును శీతల పానియం సీసాలో నింపి ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న శాన్వి.. ఆ సీసాలో ఉంది శీతల పానీయమే అనుకొని తాగేసింది. తీరా వాంతులు చేసుకుంటూ ఇంటికి పరిగెత్తడంతో వాసనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది‌. చిన్నారి శాన్విని బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..