AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు…

|

Jul 28, 2024 | 12:16 PM

భారీ వర్షాల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్లు వద్దు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. పలు ప్రాజెక్టుల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం....

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు...
Kaleshwaram Project
Follow us on

— తుంగభద్ర, కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతోంది. తుంగభద్ర ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద పెరిగింది. లక్షా 23వేల 995 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. లక్షా 48వేల 666 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం.. 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 99 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

————

అటు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు జూరాలతో పాటు.. తుంగభద్ర నుంచి భారీగా వరద వస్తోంది. రెండువైపుల నుంచి 4 లక్షల 91 వేల 591 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా.. 62వేల 214 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం..215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 142 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

————

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తోంది. సాగర్‌కు 52వేల 471 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా.. 5వేల 944 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం.. 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 130 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

————

పులిచింతల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. పులిచింతలకు కేవలం 244 క్యూసెక్కువ వరద వస్తుండగా.. ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్ట్.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం.. 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

————

గోదావరి ప్రాజెక్టులకు కూడా వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ ఫ్లో 24వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో జీరోగా ఉంది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 90 TMCలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 31.9 టీఎంసీల నీరు ఉంది.

————

ఇక ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు 18వేల 79 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 12వేల 931 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20 TMCలు కాగా.. ప్రస్తుతం17.48 టీఎంసీల నీరు ఉంది.

————

సింగూరు ప్రాజెక్ట్‌కు 3వేల 377 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సింగూరు నుంచి ఔట్ ఫ్లో.. 391 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14.32 టీఎంసీల నీటి నిల్వ ఉంది.