Telangana: పాలకుర్తిలో వినూత్న రక్షాబంధన్: గోవులకు రాఖీలు కట్టి ఆప్యాయత చాటిన మహిళ

రక్షాబంధన్ అంటే మానవ సంబంధాలకే పరిమితం కాదని జనగామ జిల్లాకు చెందిన ఓ జంతుప్రేమికురాలి నిరూపించారు. అన్నాతమ్ముళ్లకు మాత్రమే కాదు, నిత్యం మనల్ని కంటికి రెప్పలా చూసుకునే గోమాతలకు కూడా రక్షణ బంధం వేయవచ్చని చాటిచెప్పారు స్థానిక జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి. వేదమంత్రాల సాక్షిగా సాగిన ఈ వినూత్న రాఖీ వేడుక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

Telangana: పాలకుర్తిలో వినూత్న రక్షాబంధన్: గోవులకు రాఖీలు కట్టి ఆప్యాయత చాటిన మహిళ
Raksha Bandhan Beyond Humans

Edited By:

Updated on: Aug 28, 2026 | 7:41 AM

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. అయితే రక్షాబంధన్ అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదని, మూగజీవులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి. రాఖీ పౌర్ణమి పర్వదినాన ఆమె తన పెంపుడు గోవులకు రాఖీలు కట్టి తన మమకారాన్ని, సోదర భావాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. దేవగిరి భార్గవి అనే జంతు ప్రేమికురాలు రాఖీ పౌర్ణమి రోజు పెంపుడు గోవుల పట్ల తన ఆప్యాయతను చాటింది.. పెంపుడు గోవులకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటింది వేదమంత్రాల నడుమ గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి, దీపహారతి ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాధారణంగా పంచే మిఠాయిలకు బదులుగా ఆ గోవులకు అరటి పండ్లు, ఆకుకూరలు తినిపించి ఆ కుటుంబం తమ ప్రేమాభిమానాలను చాటుకుంది.

గోమాతలతో నిర్వహించిన ఈ రక్షాబంధన్ వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మూగజీవుల పట్ల ఆమె చూపిన ఆప్యాయతను చూసి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us