Weather: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

అటు చలి.. ఇటు వర్షం.. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచనలు వచ్చేశాయ్. సంక్రాంతికి కొన్ని జిల్లాల్లో వర్షాలు ముంచెత్తనున్నాయి. మరి ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ ఇచ్చిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి.

Weather: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
Telangana and Andhra Pradesh Weather Update

Updated on: Jan 12, 2026 | 9:24 AM

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చలి పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్, మెదక్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు ప్రాంతాల్లో నిన్నటి కంటే ఒకటి రెండు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందట.

ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!

అదిలాబాద్, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాచలంలో అత్యధికంగా 19 డిగ్రీలు.. ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీలు నమోదయింది.

అటు ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..