Weather Update: మండే ఎండల్లో చల్లటి వార్త.. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలను ఇటీవల కురిసిన వర్షాలు కాస్తా చల్లబరిచాయి.. అనుకునేలోపే మరోసారి వాతవారణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిగులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందిని పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది.

Weather Update: మండే ఎండల్లో చల్లటి వార్త.. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు
Ap Telangana Heavy Rain

Updated on: Apr 06, 2026 | 5:15 PM

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని తూ.గో, ప.గో, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ వర్షాల సమయంలో 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల చెబుతున్నారు.

ఇక ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు,రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. అలాగే రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల సమయంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులుతో కూడి వర్షాలతో పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడిన వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా అటు తెలంగాణలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ,బూర్గంపాడు, భద్రాచలంలో ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us