Winter Cold Waves: గత కొన్ని రోజుల క్రితం చలి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ ఒక్క సారిగా చలి పెరిగింది. నాలుగు ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉంది. ఏపీలోని విశాఖ జిల్లా(Visakha) మన్యంలో చలి తీవ్రత పెరిగింది. పాడేరు, మినుములూరులలో, లంబసింగి తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో పాటు దట్టమైన మంచు కప్పేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో (Telangana)కూడా ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం చిగురుటాకులా వణికిపోతున్నారు. రాత్రుళ్ళు ప్రజలు బయటకు రావడానికి జంకు తున్నారు. ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రహదారులను పొగ మంచు కప్పేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad)లో చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజుల క్రితం వాతావారణంలో మార్పుల వల్ల కొంత చలి తీవ్రత తగ్గినట్టు అనిపించినప్పటికీ.. గత 5 రోజుల నుంచి విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు అయినా సూర్యుడి జాడ కనిపించడం లేదు. చలికి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. కు బయటకు రావడం లేదు చలిగాలులకు వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్) మండలం అర్లి (టీ) గ్రామంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలి తీవ్రత పెరుగుతుండడంతో.. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచే రక్షణనిచ్చే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. గోరు వెచ్చటి నీళ్లు, వేడి వేడి ఆహారం తీసుకోవాలని చెప్పారు.ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు
Also Read: