Viral News: ఆర్టీసీ బస్సులో ఊపిరాడక వృద్ధుడు మృతి.. ఏం జరిగిందంటే!

ఆర్టీసీ బస్సులో ఊపిరాడక వృద్ధుడు చనిపోయిన ఘటన వెలుగుచూసింది. బోగం సాంబయ్య (65) అనే వ్యక్తి ఈ నెల 28వ తేదీ గురువారం మెట్ పల్లి నుంచి నిజామాబాద్ వెళ్తున్న హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. ప్రయాణ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, తీవ్ర వేడి, రద్దీగా ఉన్న బస్సు కారణంగా గుండెపోటుకు గురయ్యాడు.

Viral News: ఆర్టీసీ బస్సులో ఊపిరాడక వృద్ధుడు మృతి.. ఏం జరిగిందంటే!
Death

Updated on: Mar 29, 2024 | 9:42 PM

ఆర్టీసీ బస్సులో ఊపిరాడక వృద్ధుడు చనిపోయిన ఘటన వెలుగుచూసింది. బోగం సాంబయ్య (65) అనే వ్యక్తి ఈ నెల 28వ తేదీ గురువారం మెట్ పల్లి నుంచి నిజామాబాద్ వెళ్తున్న హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. ప్రయాణ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, తీవ్ర వేడి, రద్దీగా ఉన్న బస్సు కారణంగా గుండెపోటుకు గురయ్యాడు. వెంకటరావుపేట గ్రామం వద్ద బస్సును ఆపి అంబులెన్స్ ను పిలిపించి సాంబయ్యను మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి వచ్చేసరికి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కోసం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అమలుతో ఉచిత ప్రయాణానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. అయితే బస్సుల సంఖ్య పెంచకపోవడం.. ఉన్న బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వయసు మళ్లినవారు అనేక కష్టాలు పడాల్సి వస్తోంది.

వేసవి నెలలు చాలా మందికి ఓ సరదా లాంటింది. కానీ సీనియర్స్ సిటీజన్స్ కు నరకం లాంటిది.  సమ్మర్ కారణంగా అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 80% కంటే ఎక్కువ 60 ఏళ్లు పైబడినవారు సీనియర్ సిటీజన్స్ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వేసవి సీజన్ కనీస జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు.