Amit Shah: రంగంలోకి అమిత్ షా.. బీజేపీ బూత్ లెవల్ నేతలకు దిశానిర్దేషం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే మోడీ ప్రధాని హోదాలో ఆదిలాబాద్, హైదరాబాద్ లో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించి ఓటర్ల ద్రుష్టిని ఆకర్షించారు. తాజాగా అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారు.

Amit Shah: రంగంలోకి అమిత్ షా.. బీజేపీ బూత్ లెవల్ నేతలకు దిశానిర్దేషం
Amit Shah

Updated on: Mar 08, 2024 | 9:08 PM

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే మోడీ ప్రధాని హోదాలో ఆదిలాబాద్, హైదరాబాద్ లో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించి ఓటర్ల ద్రుష్టిని ఆకర్షించారు. తాజాగా అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నెల 12న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే పార్టీ బూత్ అధ్యక్షులు, ఇతర నాయకులను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు.

ఎన్నికల నిర్వహణపై సోషల్ మీడియా ప్రభావం దృష్ట్యా ఆయన తన ఒక్కరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ సోషల్ మీడియా వార్ రూమ్, పార్లమెంట్ ఎలక్షన్ వర్కింగ్ గ్రూప్ సభ్యులతో ఇన్ కెమెరా మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వివిధ విధులను పర్యవేక్షించడానికి 39 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువతపై దృష్టి సారించాలని ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ‘నమో యువ సంకల్పం’ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలోని యువతతో పార్టీ నాయకులు వీధి కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, తహసీల్, చిన్న పట్టణాలను ఈ సంకల్ప కార్యక్రమం పరిధిలోకి తీసుకువస్తామని, ఈ సమావేశానికి కనీసం 50 మంది యువతను ఆహ్వానిస్తామని తెలిపారు. గత పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విధానాలు, అవి దేశాన్ని ఎలా తీర్చిదిద్దాయో వివరిస్తారు.