Telangana: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా.. హెలైట్స్ ఇవే
బీజేపీ మేనిఫెస్టో అమిత్ షా విడుదల చేశారు. 'మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా' పేరుతో మేనిఫోస్టే రిలీజ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్‌కు చేరాయని ఆరోపించారు. ఈ 9 ఏళ్లల్లో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ శనివారం మానిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను ప్రిపేర్ చేసింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయని.. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తున్నారన్నారు అమిత్ షా. ఈ 9 ఏళ్లల్లో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మోదీ ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్ రైళ్లు కేటాయించినట్లు తెలిపారు.
మేనిఫెస్టో హైలెట్స్ ఇప్పుడు చూద్దాం….
ధరణి స్థానంలో మీ భూమి యాప్
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు