September 17th Celebrations: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సెప్టెంబర్ 17 వేడుకలు.. ఆయా పార్టీల కార్యక్రమాలివే..

September 17th Celebrations: తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న..

September 17th Celebrations: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సెప్టెంబర్ 17 వేడుకలు.. ఆయా పార్టీల కార్యక్రమాలివే..
Telangana
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2022 | 7:25 AM

September 17th Celebrations: తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు.. వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరుకావడం లేదు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు హైదరాబాద్ రాబోతున్నారు.

శుక్రవారం రాత్రి శంషాబాద్‌లో ల్యాండైన కేంద్ర హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈరోజు జరిగే అధికారకి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతకన్నా ముందు ఆయన పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంటికి వెళ్తారు. ఇటీవల ఈటల తండ్రి చనిపోవడంతో.. కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటారు.

సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణలో కార్యక్రమాలివే..

1. ఉదయం 7 గంటలకు బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ జెండా ఆవిష్కరిస్తారు. 2. 7:30 కి అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3. 8.40 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకల్లో పాల్గొననున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 4. ఉదయం 9 గంటలకు TRS ఆఫీసులో ఆ పార్టీ నేత, ఎంపీ కేశవ రావు జెండా ఆవిష్కరిస్తారు. 5. 9 .30 గంటలకు గాంధీ భవన్లో జరిగే వేడుకల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలు పాల్గొంటారు. 6. 9.30 గంటలకు కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. 7. 10 గంటలకి చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి సీపీఎం ర్యాలీ. 8. 10.30 కి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 9. 11.20 గంటలకు హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. 10. మధ్యాహ్నం 12 గంటలకి బంజారాహిల్స్‌లో గిరిజన , బంజారా భవన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 11. మధ్యాహ్నం నెక్లెస్ రోడ్డు నుంచి NTR స్టేడియం వరకు సాంస్కృతిక ర్యాలీ నిర్వహించనున్నారు. 12. 1:40 సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో మోడీ బర్త్ డే సందర్భంగా అమిత్ షా సేవా కార్యక్రమాలు చేపడతారు. 13. 2 గంటలకు ఎగ్జైబిషన్ గ్రౌండ్ లో సీపీఐ బహిరంగ సభ. 14. 3:00 గంటలకు ఈటల నివాసానికి వెళ్లనున్న అమిత్ షా.. 15 నిమిషాలు ఈటల ఫ్యామిలీతో మాటముచ్చట. 15. 4: 20 కి NPA లో అమిత్ షా ప్రోగ్రామ్. 16. సాయంత్రం NTR స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..