AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు పొడిగింపు!

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియ గడువును పెంచాలంటూ వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ఈసీ, తాజా షెడ్యూల్‌ను సవరించింది. మొదట ప్రకటించిన గడువును పొడిగిస్తూ, బూత్ స్థాయి అధికారుల (BLO) ఇంటింటి సర్వే, ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు.

తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు పొడిగింపు!
Special Intensive Revision (sir)
Balaraju Goud
|

Updated on: Jul 15, 2026 | 5:35 PM

Share

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియ గడువును పెంచాలంటూ వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ఈసీ, తాజా షెడ్యూల్‌ను సవరించింది. మొదట ప్రకటించిన గడువును పొడిగిస్తూ, బూత్ స్థాయి అధికారుల (BLO) ఇంటింటి సర్వే, ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు.

రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కేవలం తక్కువ శాతం మాత్రమే వెరిఫికేషన్ పూర్తయిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు ఈసీ అదనపు సమయాన్ని కేటాయించింది.

సవరించిన షెడ్యూల్ వివరాలు:

ఇంటింటి సర్వే (Enumeration Phase): ఆగస్టు 3, 2026 వరకు కొనసాగుతుంది.

డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటర్ల జాబితా ప్రచురణ: ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది.

ఆక్షేపణలు, అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 10 వరకు అవకాశం ఉంటుంది.

తుది ఓటర్ల జాబితా విడుదల: అక్టోబర్ మధ్య వారంలో తుది జాబితాను ప్రచురిస్తారు.

ఈ గడువు పెంపుతో బూత్ స్థాయి ఏజెంట్లు, అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి తగిన సమయం దొరికినట్లయింది. భౌతికంగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఓటర్లు ఈ సవరణ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

Election Commission Order

Election Commission Order

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us