
ఈ సారి గాంధీ జయంతి, దసరా పండగ రెండు ఒకే తేదీన వచ్చాయి. దీంతో అక్టోబర్ 2న జీహెచ్‌ఎంసీ పరిధిలోని వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను అన్ని మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని 533(బి) విభాగం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న నగరంలో మద్యం దుకాణాలు మూతబడనున్నాయి.
అదే విధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉంటుంది. ఈ కారణంగా తెలంగాణలోనూ అన్ని మద్యం షాపులు, బార్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయబడతాయి. ఈ నిబంధనలు కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. గాంధీ జయంతి పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.