Sonia Gandhi: సోనియా త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు.. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ పిలుపు..

Sonia Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోనియాకు బుధారం సాయంత్రం జ్వరం రావడంతో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. సోనియా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధికార...

Sonia Gandhi: సోనియా త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు.. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ పిలుపు..

Updated on: Jun 02, 2022 | 4:40 PM

Sonia Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోనియాకు బుధారం సాయంత్రం జ్వరం రావడంతో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. సోనియా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అధికారికంగా తెలిపారు. సోనియా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా బారిన పడిన సోనియా త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులతో పాటు పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ మనిక్కమ్‌ ఠాగూర్‌ సోనియా ఆరోగ్యాన్ని ఆకాంకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురవారం రాత్రి పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు.

తెలంగాణలోని ప్రతీ జిల్లాలోని 10 దేవాలయాలు, చర్చి, మసీదులు, గురుద్వారాలో పూజలు నిర్వహించాలని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘త్యాగం, సేవకు ప్రతిరూపమైన మా అధ్యక్షురాలు కరోనా నుంచి త్వరగా కోలుకొని పూర్తిగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాము’ అంటూ మనిక్కమ్‌ ట్వీట్ చేశారు.

మనిక్కమ్‌ ఠాగూర్‌ చేసిన ట్వీట్‌..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..