Telangana Rains: పండక్కి కూడా వాన ముసురే.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ
తెలంగాణలో మూడురోజుల భారీ వర్షం తర్వాత.. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD హెచ్చరికల ప్రకారం, బంగాళాఖాతంలో అక్టోబర్ 1–2 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడి, రాష్ట్రంలో పలువురు ప్రాంతాల్లో మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

నిన్నమొన్నటి వరకు పడిన వర్షాల తాకిడి నుంచి ఇంకా కోలుకోనే లేదు.. అప్పుడే మరో బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ. పండుగ వేళ కూడా వానలు తప్పవని స్పష్టం చేసింది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణలో వర్షాల తీవ్రత ఉంటుందని.. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 1 లేదా అక్టోబర్ 2 నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. దీంతో తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 మధ్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా IMD వేసింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 4 మధ్య వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఆవర్తనం.. అల్పపీడనంగా మారితే.. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు మరోసారి వరదల బారిన పడేే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో వరదలు సంభవించి.. జనజీవనం అస్తవ్యస్తం అయిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TGDPS) ప్రకారం.. రాష్ట్రంలో ఈ ఏడాది రుతుపవనాల కారణంగా.. 98.48 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ సగటు 73.11 సెం.మీతో పోల్చుకుంటే చాలా ఎక్కువ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
