పెళ్లైన పదినెలలకే ప్రియుడితో కలిసి ఆత్మహత్య

మహబూబ్ నగర్ జిల్లా అన్నాసాగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి పది నెలలు కాకుండానే రామేశ్వరి అనే 25 ఏళ్ల యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. నరసింహ, మణెమ్మల కూతురు రామేశ్వరి, అదే ఊరికి చెందిన నాగరాజు(31) నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే రామేశ్వరి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే భర్తతో కాపురం చేయనంటూ పుట్టింటికి వచ్చేసింది. అప్పటికీ విషయం చెప్పలేదు. అయితే […]

పెళ్లైన పదినెలలకే ప్రియుడితో కలిసి ఆత్మహత్య

Edited By:

Updated on: Mar 22, 2019 | 11:00 AM

మహబూబ్ నగర్ జిల్లా అన్నాసాగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి పది నెలలు కాకుండానే రామేశ్వరి అనే 25 ఏళ్ల యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. నరసింహ, మణెమ్మల కూతురు రామేశ్వరి, అదే ఊరికి చెందిన నాగరాజు(31) నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే రామేశ్వరి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంది.

పెళ్లైన రెండు నెలలకే భర్తతో కాపురం చేయనంటూ పుట్టింటికి వచ్చేసింది. అప్పటికీ విషయం చెప్పలేదు. అయితే సడెన్‌గా ఆమె, ప్రియుడు నాగరాజు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరువురు పురుగుల మందు తాగి తనువు చాలించారు. తండ్రి నరసింహ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.