AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అద్భుతం.. అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్

ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోండుగూడలో ఇవాళ ఉదయం 6 గంటలకు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 200 మంది ఆదీవాసులు 5 బస్సుల్లో హైదరాబాద్‌ సందర్శనయకు బయయల్దేరారు. మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించింది. వీరు తిరిగి ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు.

Telangana: అద్భుతం.. అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్
Adivasi Tourism Program
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 22, 2026 | 11:46 AM

Share

గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీని మంత్రి జూపల్లి నిలబెట్టుకున్నారు. సుమారు 200 మంది ఆదీవాసులను ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో హైదరాబాద్‌ సందర్శనకు తీసుకెళ్లారు. అయితే గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు ఉట్నూరు మండలం గొండు‌గూడలో జెండా ఊపి ఈ విజ్ఞాన యాత్రను మంత్రి జూపల్లి స్వయంగా ప్రారంభించారు.

దీంతో గోండు గూడ నుంచి 5 బస్సుల్లో సుమారు 200 మంది ఆదివాసీలు హైదరాబాద్‌కు బయల్దేరారు. వీరంతా మధ్యాహ్యం 1 గంటకు హైదరాబాద్ లోని తారామతి బారాదరికి చేరుకోని రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ రెండ్రోజుల్లో నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలను చూడటమే కాకుండా, ఆదివాసీలు ప్రపంచ పోకడలను, ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వారసత్వాన్ని దగ్గరగా గమనించాలన్నది మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన సంకల్పం. రివర్స్ టూరిజంలో భాగంగా ఆదివాసీల సంస్కృతికి నగర నాగరికతకు మధ్య వారధిని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

ఈ నెల 22 నుంచి 26 వరకు మొదటి విడత పర్యటన

ఈ విజ్ఞాన యాత్రను మొత్తం మూడు విడతలుగా రూపకల్పన చేశారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటనలో ఒక్కో బ్యాచ్‌కు 200 నుండి 250 మంది చొప్పున మూడు బ్యాచ్‌లుగా హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరి సౌకర్యార్థం మంత్రి ఆదేశాల మేరకు 5 ప్రత్యేక ఏసీ బస్సులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఈ టూర్‌లో భాగంగా ఆదివాసీలు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో