Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?

భూమి అనేది తరగని బంగారం పెద్దలు చెబుతుంటారు. కుంచెడు భూమి ఉన్న కొండంత భరోసా ఉంటుందంటారు. ఎందుకంటే రైతుకు ఏ కష్టం వచ్చినా ఆ భూమే అతనికి భరోసాగా నిలుస్తోంది. అలా ఓ రైతు 1990లో కొన్న 4 ఎకరాల భూమి ఇప్పుడు అతనిపై కనక వర్షం కురిపించింది. ఒప్పుడు రూ.60వేలు కొంటే ఇప్పుడు ఏకంగా రూ.25 కోట్లు పలికింది.

Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?
Adilabad Land Investment

Updated on: Mar 15, 2026 | 11:55 AM

భూమిపై పెట్టుబడి అనేది తమ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనే నమ్మకం జనాల్లో ఉంది. అందుకే తమ పిల్లలకు కొంత భూమినైనా సంపాధించి పెట్టాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు. గజం జాగా ఉన్న రాజులా బ్రతకొచ్చని చెబుతూ ఉంటారు. అది మన భవిష్యత్తుకు కచ్చితంగా భరోసా ఇస్తుందంటారు. ఆదిలాబాద్ జిల్లాఓ జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మూడు దశాబ్ధాల క్రితం తన బంధువు భూమిపై పెట్టిన పెట్టుబడి ఇప్పుడు అతనికి ఎంత ఆదాయాన్ని తెచ్చిందో చెబుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

రూ.60 వేలతో 25 కోట్లు

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల స్వప్నిల్ కొమావర్ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన ఇలా రాసుకొచ్చిరు. ఆదిలాబాద్‌కు చెందిన తన సమీప బంధువైన ఒక వ్యక్తి 1990లో ఎకరానికి రూ.15వేల చొప్పున మొత్తం 4 ఎకరాలను కలిసి రూ.60వేలకు కొన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే మారుతున్న కాలంలో పాటు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చిందని.. దీంతో స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ కూడా పెరిగింది. దీంతో భూముల ధరలు సైతం భారీగా పెరుగుతూ వచ్చాయని తెలిపాడు.

నెలకు రూ.14 లక్షల ఆదాయం

అయితే తాజాగా ఆయన 4 ఎకరాల స్థాలాన్ని కొనుగోలు చేసేందుకు ఓ కార్పోరేట్ సంస్ధ ముందు కొచ్చింది. మొత్తం నాలుగు ఎకరాల్లో 2 ఎకరాలు రూ.25 కోట్లు వెచ్చించి ఆ సంస్ధ కొనుగోలు చేయడంతో అతనిపై కనక వర్షం కురిసిందని చెప్పుకొచ్చారు. అయితే స్థలం అమ్మగా వచ్చిన డబ్బు మొత్తాన్ని అతను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా ప్రస్తుతం అతనికి నెలకు రూ.14 లక్షల ఆదాయం వస్తోందని రాసుకొచ్చాడు.

సోషల్ మీడియాలో మిశ్రమ కామెంట్స్

ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పొస్ట్ చూసి అందరూ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే భూమిని తరగని బంగారం అని అంటారని.. దాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ డోకా ఉండదని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కాలం కాడా కలిసి వచ్చిందని మరో యూజర్ కామెంట్ చేశారు. రోజురోజుకూ పెరుగున్న కబ్జాల మద్య అతను ఆ భూమిని ఇన్నాళ్లు కాపాడుకోవడం అనేది మామూలు విషయం కాదని మరో యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us