Adibatla Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎట్టకేలకు నిజం చెప్పిన నవీన్ రెడ్డి..

|

Dec 15, 2022 | 3:13 PM

మొన్న ప్రేమించుకున్నామన్నాడు.. నిన్న పెద్దలతో కలిసి టూర్లు వేశామన్నాడు.. ఆ తరువాత వైశాలిదే తప్పంతా అని నమ్మించాలని కుట్రలు పన్నాడు.. ఇప్పుడు లేటెస్ట్‌గా అసలు గుట్టు విప్పాడు..

Adibatla Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎట్టకేలకు నిజం చెప్పిన నవీన్ రెడ్డి..
Naveen Reddy
Follow us on

మొన్న ప్రేమించుకున్నామన్నాడు.. నిన్న పెద్దలతో కలిసి టూర్లు వేశామన్నాడు.. ఆ తరువాత వైశాలిదే తప్పంతా అని నమ్మించాలని కుట్రలు పన్నాడు.. ఇప్పుడు లేటెస్ట్‌గా అసలు గుట్టు విప్పాడు.. క్రైం సినిమాని తలదన్నేలా ఉన్న వైశాలి కిడ్నాపర్ నవీన్‌ రెడ్డి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు సంచలనం రేపుతున్నాయి. పోలీసుల అధీనంలో ఉన్న నవీన్‌రెడ్డినుంచి ఎట్టకేలకు అసలు విషయం రాబట్టారు పోలీసులు.

వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌ రెడ్డి బండారం బట్టబలైంది. పోలీసుల అదుపులో ఉన్న నవీన్‌ రెడ్డితో వాస్తవాలను వెళ్ళగక్కించారు పోలీసులు. ఇన్నాళ్లు వైశాలితో పెళ్లి అయిందని చెప్పిన నవీన్‌రెడ్డి.. చివరకు పోలీసుల ముందు మాటమార్చాడు. వైశాలితో తన పెళ్ళి తాను ఆడిన నాటకమని ఒప్పుకున్నాడు. వైశాలికి కుదిరిన పెళ్ళిని తప్పించేందుకే తానీ ప్రయత్నం చేశానన్నాడు కిడ్నాపర్‌ నవీన్‌రెడ్డి.

హైదరాబాద్‌కి చెందిన వైశాలి కిడ్నాప్‌ ఉదంతంలో తప్పంతా వైశాలిపై వేసి, జగన్నాటకమాడిన నవీన్‌ రెడ్డి నుంచి అసలు విషయం రాబట్టారు పోలీసులు. రిమాండ్‌ రిపోర్టులో నవీన్‌ రెడ్డి తనకు వైశాలితో పెళ్లి కాలేదన్న వాస్తవాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. కేవలం వైశాలి పెళ్లిని అడ్డుకునేందుకే బాపట్ల పెళ్లి డ్రామా ఆడినట్లు చెప్పుకొచ్చాడు. తనతో పెళ్ళికి తన దగ్గర పనిచేసే వాళ్ళతో వైశాలి ఇంటిపై దాడిచేయించానన్నాడు నవీన్‌ రెడ్డి. పెళ్లి చేసుకోలేదనే కోపంతో కిడ్నాప్‌ చేశానన్నాడు.

ఇవి కూడా చదవండి

మిస్టర్‌ టీకి చెందిన 40 మంది వ్యక్తులతో కిడ్నాప్‌ చేయించినట్లు చెప్పాడు. పక్కాప్లాన్‌తో జరిగిన ఈ కిడ్నాప్‌ ఇష్యూ పెద్దది కావడంతో భయపడి..రుబెన్‌ సాయంతో గోవా పారిపోయినట్లు పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు నవీన్‌ రెడ్డి. వైశాలి ఎవరికీ దక్కకూడదనే కిడ్నాప్‌ చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో నవీన్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు.

వైశాలిని కిడ్నాప్‌ చేసినప్పటి నుంచి నవీన్‌ రెడ్డి తాను చాలా మంచివాడిననీ, వైశాలి కోసం ఎన్నో చేశానని కథలు వినిపించాడు. అంతేకాదు. అందర్నీ నమ్మించాడు. పైగా వైశాలే తనని మోసం చేసిందని కపటనాటకమాడాడు. పోలీసులు లోతుగా విచారించడంతో అసలు స్టోరీ బయటకొచ్చింది.

మరోవైపు వైశాలి తను కంప్లెయింట్‌ చేసినా, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందంటున్నారు వైశాలి. మాటమార్చిన నవీన్‌ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలని తేలిపోయిందన్నారు. నన్ను బ్లేమ్ చేసి, సింపతీతో తను గెయిన్‌ కావాలనుకుంటున్నాడంటోంది వైశాలితో మా ప్రతినిధి ఫేస్‌ టు ఫేస్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..