Online Game: కొంపముంచిన ఆన్‌లైన్‌ గేమ్స్‌.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి తీసుకున్న..

|

May 07, 2024 | 3:15 PM

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మిల కుమారుడు పృథ్వీ(25) బీటెక్‌ పూర్తి చేశాడు. అనంతరం గతేడాది హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇదే సమయంలో నోయిడాకు వెళ్లాలని పృథ్వీని కంపెనీ సూచించింది. దీంతో రెండు నెలల క్రితం నోయిడాకు వెళ్లి అక్కడ ఒక గది...

Online Game: కొంపముంచిన ఆన్‌లైన్‌ గేమ్స్‌.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి తీసుకున్న..
Online Games
Follow us on

చదువు పూర్తికాగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, మంచి జీతం, ఎలాంటి ఢోకాలేని జీవితం. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే నోయిడాకు కూడా వెళ్లాడు. ఇక ఎలాంటి ఢోకా లేదని అనుకుంటున్న సమయంలో మాయదారి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆ యువకుడి ప్రాణాలను బల తీసుకున్నాయి. సమాజంలో మంచి ఉన్నత స్థానంలోకి ఎదుగుతున్న సమయంలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఆన్‌లైన్‌ గేముల కారణంగా డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కలవరానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మిల కుమారుడు పృథ్వీ(25) బీటెక్‌ పూర్తి చేశాడు. అనంతరం గతేడాది హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇదే సమయంలో నోయిడాకు వెళ్లాలని పృథ్వీని కంపెనీ సూచించింది. దీంతో రెండు నెలల క్రితం నోయిడాకు వెళ్లి అక్కడ ఒక గది అద్దెకు తీసుకొని ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. అయితే ఇదే సమయంలో పృథ్వీ ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఆకర్షితుడయ్యాడు.

ఆన్‌లైన్‌లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు పృథ్వీని ఆన్‌లైన్‌ జూదంలోకి దింపారు. దీంతో డబ్బులు కావాల్సి రావడంతో స్నేహితుల వద్ద ఏకంగా రూ. 12 లక్షలు అప్పు చేశాడు. ఆ మొత్తం కాస్త కేవలం నాలుగు రోజుల్లోనే పోగోట్టుకున్నాడు. దీంతో తీసుకున్న అప్పును ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన పృథ్వీ.. 15 రోజులుగా ఉద్యోగానికి వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక విషయం తెలుసుకున్న పృథ్వీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..