Heavy Rains Effect: ప్రాణహిత ప్రవాహంతో నరకం అనుభవించిన నిండు గర్భిణీ.. చివరికి..!

|

Jul 26, 2024 | 1:05 PM

మంచిర్యాల జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు ప్రాణహిత ప్రవాహంతో ఇబ్బంది పడుతున్న గర్భిణీని క్షేమంగా ఆస్పత్రికి తరలించారు వైద్యసిబ్బంది, పోలీసులు. వేమనపల్లి మండలంలోని సుంపుటం వంతెన దగ్గర ప్రాణహిత ఉరకలు పెడుతోంది.

మంచిర్యాల జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు ప్రాణహిత ప్రవాహంతో ఇబ్బంది పడుతున్న గర్భిణీని క్షేమంగా ఆస్పత్రికి తరలించారు వైద్యసిబ్బంది, పోలీసులు. వేమనపల్లి మండలంలోని సుంపుటం వంతెన దగ్గర ప్రాణహిత ఉరకలు పెడుతోంది. జాజులపేట గ్రామానికి దన్నూరి భారతి తొమ్మిది నెలల గర్భిణి. మరో వారం రోజుల్లో డెలీవరి అవుతుందని వైద్యాధికారులు చెప్పడంతో ఆమెను చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. సంపుటం దగ్గర వంతెన పై నుంచి ప్రాణహిత ప్రవహిస్తుండటంతో.. గర్భిణీకి క్షేమంగా హాస్పిటల్‌కు తరలించారు వైద్య సిబ్బంది. 108 వాహనం ఆస్పత్రికి వెళ్లేలా పోలీసులు కూడా వారికి సహాయం అందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..