Sangareddy: ఇదేం పైత్యంరా నాయనా.. చలానా కట్టమన్నందుకు బండికి నిప్పంటించాడు..
ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదనో, సరైన వాహన పత్రాలు లేవనో పోలీసులు బండిని పట్టుకుంటే ఏం చేస్తారు? డబ్బు కట్టి విడించుకుంటారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదనో, సరైన వాహన పత్రాలు లేవనో పోలీసులు బండిని పట్టుకుంటే ఏం చేస్తారు? డబ్బు కట్టి విడించుకుంటారు. అయితే బండి ధరకన్నా ఎక్కువ చలాన్ వేస్తే.. బండికో దండం పెట్టి దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే పోలీసులు అడపాదడపా తన బైక్‌కు చలాన్లు విధిస్తున్నారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయాడు. పోలీసుల ఎదుటే తన బైక్‌ను తగులబెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్‌లో జరిగింది. అన్నాసాగర్ వైపు బైక్ పై వెళుతున్న వ్యక్తికి అక్కడ వాహన తనిఖీలు చేస్తున్న జోగిపేట పోలీసులు ఎదురుపడ్డారు. పోలీసులు వ్యక్తిని ఆపి పత్రాలు పరిశీలించారు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో 1,100 రూపాయల జరిమానా విధించారు. ఆగ్రహంతో ఊగిపోయిన పాండు అనే ఆ వ్యక్తి అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లాడు. పెట్రోల్ పోసి బండికి నిప్పంటించాడు. పోలీసులు గమనించి మంటలు ఆర్పేలోపే బండిపూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొన్నారు.
గతంలోనూ..
కాగా ఇలా బండ్లకు నిప్పుపెట్టడం లాంటి సంఘటనలు కొత్తవేమీ కాదు.. గతంలోనూ జరిగాయి. మొన్నా మధ్య హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జత్ అలీ ఖాన్ అనే వ్యక్తి పూటుగా మందు కొట్టి పోలీసుకు దొరికిపోయాడు. దీంతో అతడి బండిని లాక్ వేసి.. సీజ్ చేశారు. అంతే ఇలాక్కాదని చెప్పి.. తన బండికి తానే నిప్పు పెట్టేశాడు. దీంతో పోలీసులు అతనిపై 70-B కింద న్యూసెన్స్ కేసు పెట్టారు. అంతకుముందు అదిలాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఫరీద్ అనే వ్యక్తి బండి మీద ఉన్న 2 వేల రూపాయల చలానా కట్టమన్నందుకు అతడు తన బైక్ నే తగలబెట్టేశాడు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:
KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..
Optical Illusion: ఈ ఫోటోలో ముందుగా మీరేం చూశారో.. అదే మీ వ్యక్తిత్వం.. కావాలంటే ఒకసారి ట్రై చేయండి..
Optical Illusion: ఈ ఫోటోలో ముందుగా మీరేం చూశారో.. అదే మీ వ్యక్తిత్వం.. కావాలంటే ఒకసారి ట్రై చేయండి..