
ప్రేమ పెళ్లికోసం కనిపెంచిన తల్లిదండ్రులను కడతేర్చింది ఓకూతురు. సూదీ మందు ఇస్తుందని మురిసిపోయిన తల్లిదండ్రులను అదే సూదిమందుతో కడతేర్చింది. ఈ దారుణ ఘటన వికారాడాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో జరిగింది. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది సురేఖ. అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరని వారికి తెలియకుండానే విషం నింపిన ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది.
మృతులు దశరథ్, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సురేఖ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. తెల్లారితే పెళ్లి చూపులు అనగా.. ఘాతుకానికి పాల్పడింది సురేఖ. ఓ యువకుడితో ప్రేమాయణం నడింపింది సురేఖ. ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోరనే భావనతో.. ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులకు కెటామైన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. అనంతరం ఏమి తెలియనట్లు తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులు సృహ తప్పి పడిపోయారంటూ కాల్ చేసి చెప్పింది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న సురేఖ అన్న, తల్లిదండ్రుల మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొడుకు అశోక్. దీంతో కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ జరిపారు.
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలగులోకి వచ్చాయి. తానే తల్లిదండ్రులను చింపేసినట్లు సురేఖ ఒప్పుకుంది. దీంతో సురేఖ ఉపయోగించిన ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సురేఖ చిన్న కూతురు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..