ఇదెక్కడి ఘోరం.. ఘర్షణ పడుతున్న వారిని విడిపించేందుకు వెళ్లి వ్యక్తి మృత్యువాత..!

చిన్న వివాదమే చిలికి చిలికి గాలి వానగా మారి హత్య వరకు ఎలా దారితీసింది. కర్నూలు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతబస్తీ కండేరి వీధిలో మనోహర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఎరుకలి రాముడు, రాజు, నగేష్ కలిసి మనోహర్ పై కత్తితో దాడి చేశారని పోలీసులు తెలిపారు.

ఇదెక్కడి ఘోరం.. ఘర్షణ పడుతున్న వారిని విడిపించేందుకు వెళ్లి వ్యక్తి మృత్యువాత..!
Kurnool District Murder

Edited By:

Updated on: Feb 27, 2026 | 1:23 PM

చిన్న వివాదమే చిలికి చిలికి గాలి వానగా మారి హత్య వరకు ఎలా దారితీసింది. కర్నూలు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతబస్తీ కండేరి వీధిలో మనోహర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఎరుకలి రాముడు, రాజు, నగేష్ కలిసి మనోహర్ పై కత్తితో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఖండేరికి చెందిన మారుతి అతని చిన్నాన్న కొడుకు విజయ్ ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్దకు వెళ్లారు. అక్కడ వైన్ షాపు వద్ద బండిమిట్టకు చెందిన ఎరుకల రాముడు అలియాస్ ముని అక్కడే ఉన్నారు. ఎరుకలి రాముడికి విజయ్ కి మాట మాట పెరిగి కొట్టుకునే స్థాయికి వచ్చారు. అయితే మారుతి వారిని విడిపించి, ఇంటికి వెళ్లిపోయాడు. విషయాన్ని ఎరుకలి రాముడు తన మిత్రుడు రాజుకు చెప్పాడు. ఆగ్రహానికి గురైన రాజు, మారుతికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మారుతి ఉదయాన్నే మాట్లాడుకుందామని ఫోన్ కట్ చేశాడు.

దీంతో ఎరుకలి రాములు ఆయన మిత్రుడు రాజు అన్న కొడుకు నాగేష్ ముగ్గురు కలిసి మారుతి, విజయ్ ల ఇంటికి వద్దకు వెళ్లి మారుతి, విజయలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. వీరి ఇంటిపైనే ఉండే మారుతి సోదరుడు మనోహర్ కిందకు వచ్చి విడిపించే ప్రయత్నం చేశాడు. రెండు గ్రూపులకు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో రాముడు, రాజు, నగేష్ ముగ్గురు కలిసి కత్తితో మనోహర్ మెడపైన దాడిచేశారు. దీంతో తీవ్ర రక్త గాయాలైన మనోహర్‌ను అక్కడే వదిలేసి ముగ్గురు నిందితులు పరారయ్యారు. అప్పటికే గాయాలైన మారుతి విజయ్ తోపాటు మనోహర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా మనోహర్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా, మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మనోహర్ బ్యాంక్ రికవరీ గ్రూపులో మెంబర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మనోహర్ మృతితో ప్రజాసంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us