Hyderabad: ఉసురు తీసిన వీధి కుక్కలు.. చిన్నారిపై మూకుమ్మడి దాడి.. తీవ్ర గాయాలతో..

|

Feb 21, 2023 | 8:55 AM

ఉపాధి కోసం ఉన్న ఊరిని, కన్నవాళ్లను వదిలేసి.. భార్యా పిల్లలతో కలిసి భాగ్యనగరానికి వచ్చాడు. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెలవు రోజు సరదాగా.. తనతో పాటు..

Hyderabad: ఉసురు తీసిన వీధి కుక్కలు.. చిన్నారిపై మూకుమ్మడి దాడి.. తీవ్ర గాయాలతో..
Street Dogs
Follow us on

ఉపాధి కోసం ఉన్న ఊరిని, కన్నవాళ్లను వదిలేసి.. భార్యా పిల్లలతో కలిసి భాగ్యనగరానికి వచ్చాడు. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెలవు రోజు సరదాగా.. తనతో పాటు తీసుకెళ్లిన ఆ తండ్రికి పుత్రశోకం మిగిలింది. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడి క్రూరంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి కి చెందిన గంగాధర్‌.. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసం ఉంటున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో పిల్లలను తాను పనిచేసే చోటుకి తీసుకెళ్లాడు. చిన్నారులను అక్కడ వదిలేసి పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపు అక్కడ ఆడుకున్న కుమారుడు ప్రదీప్‌.. తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. దీంతో బాలుడు భయపడిన వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి వదలలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అలర్ట్ అయిన బాలుడి సోదరి.. పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. ఆయన వచ్చి కుక్కలను తరిమేశాడు. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం