AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైకి చూస్తే ఏపుగా పెరిగిన పత్తి చేను.. లోపలికి వెళ్లి చూడగా పోలీసులే కళ్లు తేలేశారు

అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గంజాయి పై పోలీసులు హుక్కు పాదం మోపుతున్నారు. సమాచారం రావడమే ఆలస్యం రంగంలోకి దిగి నిఘా పెట్టి మరీ పట్టుకుంటున్నారు. గుట్టుగా సాగుతున్న గంజాయి సాగు ను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 62 లక్షల విలువ చేసే గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Telangana: పైకి చూస్తే ఏపుగా పెరిగిన పత్తి చేను.. లోపలికి వెళ్లి చూడగా పోలీసులే కళ్లు తేలేశారు
Cotton Farm Land
Naresh Gollana
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 12, 2025 | 7:09 PM

Share

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పరిధిలోని తోషం శివారులో పత్తి చేనులో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు‌. తోషం శివారులో తమ పంటచేళ్లలో సాగు చేస్తున్న ముగ్గురు రైతులకు చెందిన పత్తి పంటలో 627 గంజాయి మొక్కలను గుర్తించి కేసు నమోదు చేశారు‌. ఇచ్చోడ సర్కిల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో గంజాయి పండించడం జరిగిందని, వీరిపై గాంజా యాక్ట్.. ఎన్డిపిఎస్ ప్రకారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలనకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పెడచెవిన పెడుతూ ఇలాంటి గంజాయి మొక్కల పెంపకం చేస్తున్న వారి పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్పీ అన్నారు. వీరికి ప్రభుత్వం పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని.. గంజాయికి బానిసై యువత భవిష్యత్తును, జీవితాలను నాశనం చేసుకుంటుందని.. గంజాయి సేవిస్తూ పట్టుబడినా.. సాగు చేస్తూ పట్టుబడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 62 లక్షల 70 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఒక్కొక్క మొక్క పదివేల చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించడం జరుగుతుందని గంజాయి పండించడం పట్ల, మాదకద్రవ్యాల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతతో ఉంటూ గంజాయిని జిల్లా నుంచి తరిమి వేయడం లక్ష్యంగా విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రజలందరికీ జిల్లా ఎస్పీ సూచనలు ఇస్తూ గంజాయి పై ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని సమాచారం జిల్లా ఎస్పీకి నేరుగా అందించబడుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో జిల్లాలో 120 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 40 కిలోల వరకు ఎండు గంజాయి, 600 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ కేసులలో 240 మంది వరకు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా