Hyderabad: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న డ్రగ్స్ విక్రేతలు.. వేర్వేరు కేసుల్లో ఆరుగురు అరెస్ట్

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. సంబంధింత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సిటీలో డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఆరుగురిని రాచకొండ పోలీసులు గురువారం మూడు వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు.

Hyderabad: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న డ్రగ్స్ విక్రేతలు.. వేర్వేరు కేసుల్లో ఆరుగురు అరెస్ట్
Drugs Case

Updated on: Apr 11, 2024 | 1:33 PM

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. సంబంధింత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సిటీలో డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఆరుగురిని రాచకొండ పోలీసులు గురువారం మూడు వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు. సైదాబాద్ లో నివాసం ఉంటున్న బీహార్ కు చెందిన లాల్ బాబు కుమార్ (28), సంతోష్ నగర్ కు చెందిన మహ్మద్ ముస్తాక్ (26) హెరాయిన్ ఉన్నట్లు గుర్తించడంతో పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. బిహార్లో పప్పు, అస్లాం నుంచి గ్రాముకు రూ.5వేలకు లాల్ బాబు హెరాయిన్ కొనుగోలు చేశారు. దాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చి గ్రాము రూ.10 వేలకు అమ్ముతున్నాడు. ఇందుకుగాను ముస్తాక్ సాయం తీసుకున్నాడు. రాచకొండ ఎస్ వోటీ డీసీపీ కె.మురళీధర్ వారి వద్ద నుంచి 26 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో హయత్ నగర్ లో ముస్తాక్, లాల్ బాబులను అరెస్టు చేశారు. ఇక పప్పు, అస్లాంలను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండో కేసులో నల్లమందు కలిగి ఉన్నందుకు కార్పెంటర్ సంతోష్ దాస్ (38)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1.5 కిలోల నల్లమందు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్ కు చెందిన లోకేశ్ అనే వ్యక్తి నుంచి నల్లమందును కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నాడు.

25 గ్రాములకు రూ.5వేలకు అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక మరో కేసులో హనుమ రామ్, రాజురామ్ విష్ణోయ్, మోతీలాల్ బలోజీ అనే ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్వోటీ అరెస్టు చేసింది. ముగ్గురు నిందితులు గసగసాలు, గంజాయి విక్రయిస్తున్నారు. హనుమ రామ్, రాజురామ్ ల నుంచి 1.5 కిలోల గసగసాలు, మోతీలాల్ నుంచి కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజు వ్యవధిలో ఆరుగురు అరెస్ట్ అయ్యారు.